
ఫ్రాన్స్‌లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోవడం, విద్యారంగంలో నెలకొన్న లోపాలు, తీవ్ర అసమానతలపై విసిగిపోయిన ప్రజలు ఫ్రాన్స్‌లో రోడ్డెక్కడంతో దేశం అట్టుడుకుతోంది. విద్యార్థులు, కార్మిక సంఘాల పిలుపుతో లక్షలాది మంది చేపట్టిన ఆందోళనలు పూర్తిగా హింసాత్మకంగా మారాయి. పారిస్, లిమోజెస్, మార్సెయిల్, లియోన్ వంటి ప్రముఖ నగరాలన్నీ అల్లరి మూకల దాడులతో రణరంగాన్ని తలపించాయి. ఈ తీవ్ర ఘర్షణల నేపథ్యంలో లిమోజెస్‌లో రెండు ప్రపంచ యుద్ధాలను తట్టుకుని నిలబడిన 143 ఏళ్ల నాటి చారిత్రక టౌన్ హాల్ అగ్నికి ఆహుతి అయ్యింది.
Also Read : ఫ్రాన్స్‌లో అశాంతికి వాళ్లే కారణం.. డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
One of the iconic historic building of France which survived 2 world wars was destroyed today by the rioters ( French cockroaches 🪳).
Europe is in the verge of civil war!
This is what they want to happen in our nation too!https://t.co/VU15JLwuD3
— Major Madhan Kumar (Retd)🇮🇳 (@major_madhan) October 18, 2026
ఈ ప్రమాదంలో భవనం పైకప్పు కుప్పకూలడంతో పాటు 43 మీటర్ల ఎత్తున్న ప్రసిద్ధ క్లాక్ టవర్ పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో లోపల సిబ్బంది ప్రాణభయంతో వలసపోవాల్సి వచ్చింది. కేవలం ప్రభుత్వ కార్యాలయాలే కాకుండా ఎన్నో విలాసవంతమైన దుకాణాలను ఆందోళనకారులు లూటీ చేశారు. పారిస్‌లోని ప్రముఖ కూడళ్లన్నీ ధ్వంసమైన రాళ్లు, పగిలిన గాజులతో భయానకంగా మారాయి. మార్సెయిల్లో పోలీస్ స్టేషన్‌పై, లియోన్‌లో టూరిజం ఆఫీస్‌పై దాడులు జరగడంతో పరిస్థితి మరింత దిగజారింది.
ఈ విధ్వంసంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుత నిరసనలకు, అరాచకానికి పాల్పడేవారికి స్పష్టమైన తేడా ఉందని ఆయన స్పష్టం చేశారు. దేశాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలను అస్థిరపరచాలని చూసే ఎవరినీ వదిలిపెట్టబోమని.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు అవసరమైన చోట నిరసనలను నిషేధించిన ప్రభుత్వం.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,400 మందికి పైగా అల్లరి మూకలను అదుపులోకి తీసుకుంది.
Also Read : వినియోగదారులకు బిగ్ అలర్ట్.. భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ రేట్లు!









