Telangana :  తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మూడో రోజు కూడా రగడ కొనసాగింది. సభ ప్రారంభమైన వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలకు అడ్డుతగిలారు. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆమోదించారు.

Also Read : గణేశ్‌ విగ్రహం పెడుతున్నారా? ఆన్‌లైన్‌లో నమోదు తప్పనిసరి.. ఇలా చేయండి…

దీంతో కేటీఆర్, హరీశ్‌రావు సహా మొత్తం 19 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేశారు. 22A సహా ప్రజా సమస్యలపై చర్చ జరపాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. అయితే తమను సభ నుంచి సస్పెండ్ చేయడం ద్వారా ప్రజా సమస్యలను చర్చకు రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. సస్పెన్షన్ అనంతరం స్పీకర్‌ను కలిసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లగా.. వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీ ప్రాంగణంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

అసెంబ్లీ ఆవరణలో తమపై దాడి జరిగినా ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఆవరణలో జరిగిన ఘటనపై ప్రభుత్వం నుంచి కనీసం ప్రకటన కూడా రాలేదని వారు అన్నారు.

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బాధపడ్డారని తెలుసుకున్న కేసీఆర్.. తాము కూడా విచారం వ్యక్తం చేయాలని చెప్పారని సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. మంత్రులు అమ్మ గురించి మాట్లాడుతున్నారు.. మరి మేము కూడా మహిళలమే కదా? అని వారు ప్రశ్నించారు. తమపై దాడి జరిగిన విషయం తెలుసుకున్న దేశంలోని వివిధ రాష్ట్రాల నేతలు ఫోన్ చేసి పరామర్శిస్తున్నారని చెప్పారు. మహిళలపై దాడి జరిగితే కనీసం పట్టింపు లేకపోవడం బాధాకరమన్నారు. సభ జరుగుతున్న సమయంలో అసెంబ్లీ బయట ఏదైనా ఘటన జరిగితే దానిపై సభలో ప్రకటన చేస్తారని.. కానీ అసెంబ్లీ ఆవరణలోనే ఘటన జరిగితే కనీసం దానిపై ప్రకటన కూడా చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : తెలంగాణ బీసీ మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు…దరఖాస్తు చేసుకోండిలా…

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.