
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని దుండగులు ముంబైలో దాడికి దిగిన విషయం తెలిసిందే. అయితే సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే సమయంలో ఎన్సీపీ సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్య జరిగింది. ఇప్పుడు మళ్లీ బాలీవుడ్ హీరోపై కాల్పులు జరిగాయి. ఈ దాడలో టైగర్ ష్రాఫ్ గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే.. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్యాంగ్‌స్టర్ అనిల్ పండిత్ ఈ దాడికి తానే బాధ్యుడినని ప్రకటించుకుంటూ భద్రతా సంస్థలకు ఒక ఆడియో క్లిప్‌ను విడుదల చేశాడు.
Also Read : ప్రభాస్ స్పిరిట్ కొత్త రిలీజ్ డేట్.. రామాయణం పార్ట్ 2తో బాక్సాఫీస్ క్లాష్!
Viral Audio: In the firing case on Tiger Shroff, members of the Lawrence Bishnoi gang, Anil Pandit and Harman Sandhu, have claimed responsibility. Mumbai Police is investigating this claim made on social media. An audio is going viral
#TigerShroff #MumbaiPolice #Lawrencebishnoi #FiringIncident
— Indian Observer (@ag_Journalist) October 18, 2026
హర్యానాలోని పానిపట్ ప్రాంతానికి చెందిన పండిత్ 2024లో అక్రమ మార్గం డంకీ రూట్ ద్వారా అమెరికాకు వలస వెళ్లినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అమెరికాకు వెళ్లిన తర్వాతే అతడు బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలు ఏర్పరచుకుని నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. భారత్‌లో ఉన్న సమయంలో అతడిపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు కానీ, విదేశాలకు వెళ్లిన తర్వాతే అతడిపై పలు నేర కేసులు నమోదయ్యాయి. ఆడియో క్లిప్‌లో లారెన్స్ బిష్ణోయ్ పేరును పదేపదే ఉపయోగిస్తున్నప్పటికీ పండిత్ నేరుగా బిష్ణోయ్ నుంచి ఆదేశాలు అందుకోవడం లేదని తెలుస్తోంది. అతడికి ‘హారీ బాక్సర్’ అనే వ్యక్తి హ్యాండ్లర్‌గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. హారీ బాక్సర్ 2022 నుంచి అమెరికా నుంచే తన కార్యకలాపాలు సాగిస్తున్నాడు. రాజస్థాన్, పంజాబ్, దిల్లీలలో ఈ హారీ బాక్సర్‌పై పలు దోపిడీలు, హత్యాయత్నం కేసులు ఉన్నాయి.
టైగర్ ష్రాఫ్‌పై దాడి అనంతరం విడుదల చేసిన ఆడియోలో అనిల్ పండిత్ బాలీవుడ్ ఇండస్ట్రీకి వార్నింగ్ ఇచ్చాడు. సల్మాన్ ఖాన్ వెంటనే బిష్ణోయ్ సమాజానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని.. లేదంటే సల్మాన్‌తో కలిసి పనిచేసే ప్రతీ ఒక్కరిని చంపేస్తామని బెదిరించాడు. టైగర్ ష్రాఫ్‌కు తాము ముందే వార్నింగ్ ఇచ్చినా పట్టించుకోలేదని, అందుకే ఈ దాడికి పాల్పడ్డామని తెలిపాడు. అలాగే సల్మాన్ ఖాన్ కుటుంబ సభ్యులకు కూడా బెదిరింపులు పంపాడు. అయితే ఈ ఆడియో క్లిప్, బెదిరింపులపై పోలీసులు ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు. ఈ దాడితో తీవ్ర ఆందోళనకు గురైన ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్, బాలీవుడ్‌కు తక్షణమే కఠినమైన రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గత కొంతకాలంగా బాలీవుడ్ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని ఈ గ్యాంగ్ వరుస దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే.
Also Read : పునీత్ చనిపోయే ముందు ఏం జరిగిందంటే.. ఐదేళ్ల తర్వాత అసలు విషయం బయటపెట్టిన డాక్టర్









