-RAVI PRAKASH

America vs India :నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ రిలేషన్‌షిప్‌లో మరో డిఫికల్ట్ ఫేజ్ రాబోతుందా? అమెరికా మరోసారి ఇండియా మీద ప్రెజర్ పెంచడానికి ప్రిపేర్ అవుతుందా? నిజంగానే ఇండియామీద అప్ టూ 100% టారిఫ్‌ పడే ఛాన్స్ ఉందా? తెర వెనుక డోనల్డ్ ట్రంప్ సైలెంట్‌గా ఒక బిగ్‌ గేమ్‌ స్టార్ట్ చేయబోతున్నారా? ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్! ఈరోజు వీటన్నింటికీ మనకు ఆన్సర్స్ కావాలి. ఎందుకంటే, లాస్ట్ ఫ్యూ అవర్స్‌లో యునైటెడ్ స్టేట్స్‌లో జరిగిన పరిణామాలు ఇండియాపై సీరియస్ ఇంపాక్ట్ చూపించొచ్చు. యూఎస్ సెనేట్ రష్యా, ఇరాన్‌లను టార్గెట్ చేస్తూ ఒక మేజర్ శాంక్షన్స్ బిల్లును పాస్ చేసింది. అది కూడా ఓవర్‌వెల్మింగ్ 86-11 ఓట్స్‌తో ఈ బిల్లు క్లియర్ అయింది. కానీ, ఈ బిల్లులో ఇండియా చాలా కేర్‌ఫుల్‌గా వాచ్ చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఒకవేళ ఈ బిల్లు యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో కూడా క్లియర్ అయి, యాక్ట్‌గా మారిపోతే రష్యా నుంచి ఆయిల్ లేదా గ్యాస్ ఎక్కువగా కొనే కంట్రీస్‌పై అమెరికన్ ప్రెసిడెంట్‌కు అప్ టూ 100% టారిఫ్స్ విధించే పవర్స్ వస్తాయి. మరోవైపు, ఈ లిస్ట్‌లో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్న మెయిన్ కంట్రీస్‌లో మన ఇండియా కూడా ఒకటి!

ఇప్పుడు నేను ఒక విషయం క్లియర్‌గా చెప్తాను. అమెరికా అయితే ఇండియాపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. నాట్ యెట్! సెనేట్ మాత్రమే ఈ బిల్లును పాస్ చేసింది. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఇంకా దీన్ని కన్సిడర్ చేయాలి. ఒకవేళ అక్కడ కూడా పాస్ అయితే, ఫైనల్‌గా చట్టంగా మారుతుంది. కానీ యూఎస్ సెనేట్ ఇంత మాసివ్ మెజారిటీతో ఈ బిల్లుకు అప్రూవల్ ఇవ్వడం అనేది, సాధారణ విషయం కాదు, ఇది భారత్‌కు ఒక పెద్ద హెచ్చరికలాంటిది! ఎందుకంటే సడన్‌గా… రష్యా నుంచి ఇండియా ఆయిల్ పర్చేజ్ చేయడం అనేది… కేవలం ఒక ఎనర్జీ డిసెషన్‌లా మాత్రమే మిగల్లేదు. ఇండియా-యూఎస్ రిలేషన్‌షిప్‌కే ఇదొక పెద్ద ప్రాబ్లమ్‌గా మారే ఛాన్స్ ఉంది! సో, టుడే… అసలు అమెరికన్ క్రాస్‌హైర్స్‌లో ఇండియా ఎందుకు ఉంది? ఇండియాపై ఒకవేళ 100% టారిఫ్ పడితే రియల్‌గా దాని మీనింగ్ ఏంటి? ఏ ఇండియన్ ఇండస్ట్రీస్ దీనివల్ల హిట్ అయ్యే ఛాన్స్ ఉంది? ఇండియా సడన్‌గా రష్యా ఆయిల్ కొనడం ఆపేయగలదా? ఒకవేళ ఆపేస్తే ఇండియా ఎనర్జీ సెక్యూరిటీ పరిస్థితి ఏంటి? వీటిన్నింటిపై క్లియర్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే… మోదీ-ట్రంప్ రిలేషన్‌షిప్ ఘర్షణ వైపు వెళ్తోందా? అసలు తెరవెనుక ఏం జరుగుతుందో… ఒక్కో క్వశ్చన్‌ను క్లియర్‌గా అనలైజ్‌ చేద్దాం.

అసలు ఇండియాను సడన్‌గా అమెరికా ఎందుకు టార్గెట్ చేసింది? దీన్ని అర్థం చేసుకోవాలంటే… మనం ఒకే ఒక్క విషయం క్లియర్‌గా తెలుసుకోవాలి. అదే… రష్యా ఆయిల్! ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తిన తర్వాత, అమెరికా దాని మిత్రదేశాలు మాస్కోపై ఆంక్షలు విధించాయి. ఎనర్జీ ఎక్స్‌పోర్ట్స్ ద్వారా రష్యా సంపాదిస్తున్న రెవెన్యూను కట్ చేయడానికి చాలా ప్రయత్నించాయి. కానీ, ఇండియా మాత్రం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనడం అస్సలు ఆపలేదు. దీని వెనుక చాలా ఇంపార్టెంట్ రీజన్ ఉంది. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ చాలా తక్కువ ధరకే లభించడంతో… ఇండియా తన భారీ ఇంధన అవసరాలను ఎటువంటి ఇబ్బంది లేకుండా తీర్చుకోగలుగుతోంది. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే… ఇది అమెరికాను ధిక్కరించడం ఎంతమాత్రం కాదు. ఇది భారత్ ఇంధన భద్రతకు సంబంధించిన అంశం. కానీ, వాషింగ్టన్ మాత్రం ఈ ఇష్యూను కంప్లీట్ డిఫరెంట్ యాంగిల్‌లో చూస్తోంది. అమెరికా వాదన ఏంటంటే… కంట్రీస్ ఇలా కంటిన్యూగా రష్యా నుంచి లార్జ్ క్వాంటిటీస్‌లో ఆయిల్, గ్యాస్ కొంటూపోతే, రష్యాకు ఎనర్జీ రెవెన్యూ ఫ్లో అవుతూనే ఉంటుంది. అందుకే… రష్యాపై ఆర్థిక ఒత్తిడి పెంచాలనుకుంటే… కేవలం మాస్కో వైపు చూస్తే సరిపోదు! రష్యా నుంచి ఆయిల్ కొనే బిగ్గెస్ట్ కస్టమర్స్ వైపు కూడా చూడాల్సిందే! అందుకే ఈ కొత్త యూఎస్ లెజిస్లేషన్ ఈరోజు ఇంత ఇంపార్టెంట్‌గా మారింది. అమెరికా సెనేట్ పాస్‌ చేసిన బిల్లు యాక్ట్‌గా మారితే… రష్యన్ ఎనర్జీని ఎక్కువగా కన్జ్యూమ్ చేసే కంట్రీస్‌పై అమెరికన్ ప్రెసిడెంట్ అప్ టూ 100% వరకు టారిఫ్స్ విధించే పవర్స్ అందుకుంటారు. ఈ లిస్ట్‌లో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్న కంట్రీస్‌లో ఇండియా కూడా స్పెసిఫిక్‌గా ఉంది. ఈ జాబితాలో చైనా, జపాన్, కొన్ని యూరోపియన్ కంట్రీస్ లాంటి మేజర్ రష్యన్-ఎనర్జీ బయర్స్ కూడా ఉన్నారు. సో, టెక్నికల్లీ ఇది… “ఇండియాను శిక్షించాలి” అని చెప్తున్న బిల్లు అయితే కాదు. రష్యాను కట్టడి చేయడానికి అమెరికా వేస్తున్న ఒక పెద్ద ఆంక్షల వ్యూహం! But, ఒకే ఒక్క రీజన్ వల్ల… ఇందులో ఇండియా ఇరుక్కునే ఛాన్స్ ఉంది. అదే.. రష్యన్ ఆయిల్!

Also Read : దిగుమతి టారిఫ్‌ పెంపుదల.. బంగారం, వెండితో ₹10వేల కోట్లు రాబడి

అమెరికా సెనేట్ తెచ్చిన ఈ బిల్లు… ఇండియాకు నిజంగానే పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఇప్పుడు ఢిల్లీ ముందు ఎలాంటి కఠినమైన పరిస్థితి ఉందో ఒక్కసారి చూడండి. “రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు తగ్గించుకోండి!” అని ఒకవైపు అమెరికా హెచ్చరిస్తోంది. మరోవైపు ఇండియా ఎదుర్కొంటున్న అసలు ప్రశ్న ఏంటంటే… “మనకు కావాల్సిన క్రూడ్ ఆయిల్ వేరే ఎక్కడ దొరుకుతుంది? అది కూడా ఏ ధరలో లభిస్తుంది?” అని! ఎందుకంటే, మన దేశానికి కావాల్సిన క్రూడాయిల్‌లో సింహభాగం విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాలి. తక్కువ ధరకే రష్యన్ ఆయిల్ దొరుకుతున్నప్పుడు… మనం ఆ డీల్‌ను ఎందుకు వదులుకోవాలి? ఇదే ఇప్పుడు ఇండియా వాదన. మన దేశ ఇంధన అవసరాలు, జాతీయ ప్రయోజనాలే తమకు మొదటి ప్రాధాన్యత అని ఇండియా ఎప్పటి నుంచో స్పష్టం చేస్తూ వస్తోంది. కానీ వాషింగ్టన్ మాత్రం ఇప్పుడు చాలా క్లియర్‌గా వార్నింగ్ ఇస్తోంది. “మీరు రష్యా నుంచి కొనుగోలు చేసే ఆయిల్‌ను బట్టే… అమెరికా మార్కెట్‌లో మీ వ్యాపారం ఆధారపడి ఉంటుంది!”

అమెరికా ఇస్తోన్న ఈ వార్నింగ్‌తో ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఇది కేవలం ఆయిల్‌తో ఆగిపోయే వివాదం కాదు. ఎందుకంటే, ఇండియా ప్రతిఏటా అమెరికా మార్కెట్‌కు బిలియన్ల కొద్దీ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేస్తోంది. అందుకే, ప్రతి ఇండియన్ ఎక్స్‌పోర్టర్ ఇప్పుడు కచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఇదే! ట్రేడ్‌ ఇష్యూని చాలా సింపుల్‌గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక ఇండియన్ కంపెనీ అమెరికాకు 100 డాలర్స్ వర్త్ ప్రొడక్ట్‌ను ఎక్స్‌పోర్ట్ చేస్తుంది. ఆ ప్రొడక్ట్‌పై 100% టారిఫ్ పడితే… యూఎస్ ఇంపోర్టర్ అదనంగా మరో 100 డాలర్స్ పే చేయాల్సి రావచ్చు. అంతమాత్రాన మన ఎక్స్‌పోర్టర్స్ వెంటనే అంత మొత్తాన్ని లాస్‌ అవుతారని కాదు. అసలు ఎకనామిక్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఆ ప్రొడక్ట్ ఏంటి, ఏవైనా మినహాయింపులు ఉన్నాయా, కాంట్రాక్ట్స్ ఎలా ఉన్నాయి, ప్రైజింగ్ ఏంటి, ఫైనల్‌గా ఆ టారిఫ్ బర్డెన్ ఎవరి మీద పడుతుంది అనే దానిపై బిజినెస్ డిపెండ్ అయి ఉంటుంది. కానీ, ఒక్క విషయం మాత్రం క్లియర్. 100% టారిఫ్ అనేది హ్యూజ్ ట్రేడ్ బ్యారియర్! దీనివల్ల అమెరికన్ మార్కెట్‌లో ఇండియన్ ప్రొడక్ట్స్ కాస్ట్లీగా అయిపోవచ్చు. ఒకవేళ అదే జరిగితే… అమెరికన్ బయ్యర్‌కు చాలా ఆప్షన్స్ ఉంటాయి. అతను ఆ అదనపు కాస్ట్‌ను తానే భరించొచ్చు. లేదా అందులో కొంత భాగం కన్స్యూమర్‌పై వేయొచ్చు. లేదా మన ఇండియన్ సప్లయిర్‌తో ప్రైస్ విషయంలో నెగోషియేట్ చేయొచ్చు. ఇంకొచెం బెటర్‌గా ఆలోచించి… సేమ్ ప్రొడక్ట్‌ను అమ్మే వేరే కంట్రీ కోసం సెర్చ్ చేసుకోవచ్చు!

ఇప్పుడు మనల్ని అసలు ప్రశ్నకు తీసుకొచ్చే సమయం వచ్చింది. దీనివల్ల ఏయే ఇండియన్ పరిశ్రమలు గట్టిగా దెబ్బతినే అవకాశం ఉంది? ఇప్పుడు కోట్ల మంది భారతీయులకు సంబంధించిన అసలు ప్రశ్నకు వద్దాం. ఒకవేళ అమెరికా నిజంగానే 100 శాతం వరకు టారిఫ్స్ విధిస్తే… మన దేశంలో ఏ వ్యాపారాలు మొదటగా దెబ్బతింటాయి? అమెరికా అనేది, మనదేశం ఎగుమతులు జరిగే అతి ముఖ్యమైన మార్కెట్లలో ఒకటి. అలాగే, మనం అమెరికాకు కేవలం ఒకట్రెండు రకాల వస్తువులు మాత్రమే పంపడం లేదు. ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, మెషినరీ, టెక్స్‌టైల్స్, గార్మెంట్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఇంజనీరింగ్ గూడ్స్, కెమికల్స్… ఇలా ఎన్నో రకాల ప్రొడక్ట్స్‌ను Export చేస్తున్నాం. అందువల్ల, అమెరికా కస్టమర్ల మీదే పూర్తిగా ఆధారపడి వ్యాపారం చేస్తున్న ఒక భారత కంపెనీని ఊహించుకోండి. అతను తయారు చేసే వస్తువు ఒక్కసారిగా అమెరికా మార్కెట్‌లో చాలా ధర పెరుగుతుంది. అప్పుడు జరిగేది ఏంటి? అక్కడ బయర్ ఇలా అనొచ్చు “నేను ఈ వస్తువును వేరే దేశం నుంచి కొంటానని.” దాంతో, మన ఇండియన్ ఎక్స్‌పోర్టర్ ధరను తగ్గించే పరిస్థితి రావొచ్చు. అప్పుడు అతని లాభాలు తగ్గిపోతాయి. ఆర్డర్లు పడిపోతాయి. ప్రొడక్షన్‌ను తగ్గించాల్సి వస్తుంది. చివరికి… ఉద్యోగాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే, ఈ టారిఫ్ వార్ అనేది కేవలం ప్రభుత్వాల మధ్య జరిగే గొడవ మాత్రమే కాదు. ఇది చివరకు ఫ్యాక్టరీల వరకూ పాకుతుంది. ఎక్స్‌పోర్టర్లను తాకుతుంది. కార్మికులను ఇబ్బంది పెడుతుంది. ఫైనల్‌గా… పేద, మధ్యతరగతి కుటుంబాలపై కూడా ఈ ప్రభావం పడుతుంది.

అమెరికాకు మన దేశం నుంచి ప్రధానంగా ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, మెషినరీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ, టెక్స్‌టైల్స్, కెమికల్స్, ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతి అవుతుంటాయి. వీటిలో చాలా రంగాలకు అమెరికా మార్కెట్ ఎంతో కీ రోల్ పోషిస్తోంది. అందుకే భారీగా పన్నులు విధిస్తే… మన వస్తువుల పోటీతత్వం దెబ్బతింటుంది. కానీ, ఈ కథలో మరో కోణం కూడా ఉంది. ఎందుకంటే, ఆంక్షలు కేవలం టార్గెట్ చేసిన దేశాన్ని మాత్రమే ఇబ్బంది పెట్టవు. అమెరికాలో దిగుమతి చేసుకునే వాళ్ళు కూడా Tax కట్టాలి. ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. ఈ భారాన్ని మోసేది ఎవరు? ఇండియన్‌ ఎక్స్‌పోర్టరా? అమెరికాలోని ఇంపోర్టరా? లేక అమెరికాలో పర్చేజ్‌ చేసే కస్టమరా? లేదా ఈ ముగ్గురూ కలిసి భరిస్తారా? వస్తువును బట్టి ఈ సమాధానం మారొచ్చు. కానీ, ఒక్క విషయం మాత్రం క్లియర్‌. 100 శాతం టారిఫ్ అమలైతే మాత్రం, అమెరికా-ఇండియా మధ్య బిజినెస్‌ చాలా కాంప్లికేటెడ్‌గా మారిపోతుంది. ఇక్కడే అసలైన, అత్యంత క్లిష్టమైన డైలెమా ఎదురవుతుంది.రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు తగ్గించుకోవాలని అమెరికా వార్నింగ్ ఇస్తున్న వేళ.. ఇండియా నుంచి ఒక ప్రశ్న ఇప్పటికీ అలాగే ఉంది. మనకు కావాల్సిన ఆయిల్ ఎక్కడ దొరుకుతుంది? ప్రపంచంలో క్రూడాయిల్‌ ఎక్కువగా వాడే దేశాల్లో ఇండియా ఒకటి. మనకు కావలసిన ఆయిల్‌లో ఎక్కువ భాగం విదేశాల నుంచే దిగుమతి అవుతుంది. ఉక్రెయిన్ వార్ తర్వాత రష్యన్ క్రూడ్ చాలా తక్కువ ధరకే లభించడంతో… మన దేశ రిఫైనర్స్‌కు అది చాలా ఉపయోగపడింది. లాభపడింది. దీనివల్ల మన రిఫైనర్లు సప్లైని కరెక్టుగా మేనేజ్ చేయగలిగారు. ఇండియా తన ఇంధన ఖర్చును చాలా ఈజీగా మేనేజ్ చేసుకోగలిగింది. కాబట్టి భారత్ కోణంలో నుంచి చూస్తే… ఇది మాస్కోతో కేవలం రాజకీయ స్నేహం మాత్రమే కాదు. ఇదొక పెద్ద ఆర్థిక లెక్క కూడా. తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసి… దానిని రిఫైన్ చేసి… కోట్లాది మంది జనాభా ఉన్న మన దేశ ఇంధన అవసరాలను తీర్చుకోగలుగుతున్నప్పుడు… ఇండియా ఆ సరఫరాను ఎందుకు ఈజీగా వదులుకోవాలి? కానీ, వాషింగ్టన్ Argument మాత్రం చాలా క్లియర్‌గా ఉంది. మీరు రష్యా ఆయిల్‌ను కొంటూ పోతే, రష్యాకు డబ్బు సంపాదించి పెట్టినట్లే అవుతుంది. అందుకే, రష్యన్ ఎనర్జీని కొనుగోలు చేసే దేశాలపై ఆర్థికభారం మోపాలని అమెరికా స్ట్రాంగ్‌గా ఉంది. దాంతో ఇండియాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి తలెత్తింది.

ప్రస్తుత పరిస్థితి గట్టెక్కాలంటే భారత్‌ ముందున్న ఆప్షన్స్‌ని చూద్దాం! ఫస్ట్‌ ఆప్షన్‌: రష్యన్ ఆయిల్ కొనుగోలు తగ్గించుకోవడం. దీనివల్ల అమెరికాతో గొడవ పడే రిస్క్‌ తప్పుతుంది. సెకండ్ ఆప్షన్: రష్యన్ ఆయిల్ కొనడం కొనసాగించడం. దీనివల్ల అమెరికా విధించే భారీ టారిఫ్స్‌ భారాన్ని భరించాల్సి వస్తుంది. మూడో ఆప్షన్: మిడిల్ ఈస్ట్, అమెరికా, ఆఫ్రికా లాంటి వేరే దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్‌ను భారీగా పెంచుకోవడం. కానీ, ఈ మూడో ఆప్షన్ అంత easy కాదు. ఒక పెద్ద ఆయిల్ సప్లైయర్‌ను రాత్రికి రాత్రే మార్చేయడం అంటే… పెట్రోల్ బంక్‌లో బ్రాండ్ మార్చినంత ఈజీగా కాదు. రిఫైనరీలు వేర్వేరు రకాల క్రూడ్ ఆయిల్‌ను ప్రాసెస్‌ చేయాల్సి ఉంటుంది. షిప్పింగ్‌ ఖర్చు ఉంటుంది. బీమా, డీల్స్, ట్రావెలింగ్ అన్నీ చూసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా… ఖర్చు ఎంత పడుతుంది అనేది ఇంపార్టెంట్‌. తక్కువ ధరకే దొరికే రష్యన్ క్రూడ్‌కు బదులుగా… ఎక్కువ ఖర్చుతో కూడిన వేరే ఆప్షన్స్ ఎంచుకోవాల్సి వస్తే… ఆ భారం భరించేది ఎవరు? ప్రభుత్వమా? ఆయిల్ కంపెనీలా? లేక సామాన్య ప్రజలా? అందుకే ఈ రష్యన్ ఆయిల్ ప్రశ్న అనేది కేవలం విదేశీ ఇష్యూ మాత్రమే కాదు. ఇది మన దేశ ఇంధన భద్రతకు, సామాన్యుల బతుకుదెరువుకు సంబంధించిన జీవన్మరణ సమస్య. అయితే ఈ పార్ట్‌లో ఇప్పటికీ అసలు ప్రశ్న ఇంకా అలాగే మిగిలి ఉంది. రష్యన్ ఆయిల్‌కు భారత్ పూర్తిగా గుడ్‌బై చెప్పగలదా?

ఇప్పుడు నేను చెప్పేది… వినడానికి చాలా సింపుల్‌గా అనిపించొచ్చు. అమెరికా ఏమంటోందంటే.. “రష్యన్ ఆయిల్ కొనడం ఆపేయండి” అని! మరి ఇండియా ఎందుకు ఆపలేకపోతోంది? ఎందుకంటే ఇది అంత ఈజీ కాదు. ఒకవేళ ఇండియా ఆ పని చేయాలనుకుంటే.. ఆల్టర్నేటివ్ సప్లైస్… వేరే రకాల క్రూడ్ గ్రేడ్స్… షిప్పింగ్ కెపాసిటీ… ఇన్సూరెన్స్… కాంట్రాక్ట్స్… రిఫైనరీ కంపాటిబిలిటీ… అన్నింటికంటే ముఖ్యంగా… కాంపిటీటివ్ ప్రైసెస్‌ మీద ఫోకస్‌ పెట్టాలి. ఖచ్చితంగా ఇండియా ఆయిల్ సోర్సెస్‌ను డెఫినెట్‌గా డైవర్సిఫై చేసుకోగలదు. ఇప్పటికే అదే పద్ధతి ఇంప్లిమెంట్ చేస్తోంది. కానీ రష్యన్ క్రూడ్‌ను పూర్తిగా, ఇమ్మీడియట్‌గా రీప్లేస్ చేయాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో అదనపు ఖర్చు భరించాల్సి ఉంటుంది. అయితే ఆ అదనపు ఖర్చు ఎవరో ఒకరు, ఎక్కడో ఒకచోట భరించాల్సిందే! ప్రభుత్వం భరించాలి. లేదా ఆయిల్ కంపెనీలు భరించాలి. లేదా ఆ భారం డైరెక్ట్‌గా కన్జూమర్లపై పడుతుంది. అందుకే ఇప్పుడు “రష్యన్ ఆయిల్ కొనడం ఇండియా ఆపేస్తుందా?” అన్నది అసలు ప్రశ్న కాదు. టెక్నికల్‌గా చూస్తే… Yes, ఆపగలదు. కానీ అత్యంత బిగ్గెస్ట్‌ క్వశ్చన్ ఏంటంటే… “ఇండియా ఈ విషయంలో ఎంత మూల్యం చెల్లించాలి?”

ఒకవేళ రష్యన్ ఆయిల్ పర్చేజెస్‌ను ఇండియా భారీగా తగ్గించింది అనుకుందాం. అప్పుడు మిడిల్ ఈస్ట్, అమెరికా, ఆఫ్రికా లాంటి వేరే దేశాల నుంచి ఎక్కువ క్రూడ్ తెప్పించుకోవచ్చు. కానీ ఆ సప్లైస్ Costly అయితే… ఇండియా ఇంపోర్ట్ బిల్ విపరీతంగా పెరుగుతుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి… గ్లోబల్ మార్కెట్‌లో ఆయిల్ ప్రైసెస్ పెరిగినప్పుడల్లా ఇండియా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ బిల్లుపై ఇప్పటికే పెద్ద ప్రెషర్ పడుతుంది. అందుకే న్యూఢిల్లీ రెండు పెద్ద రిస్క్‌ల మధ్య నలగాల్సి వస్తుంది. ఒకవైపు- రష్యన్ ఆయిల్ కొనడం వల్ల అమెరికాతో వచ్చే ట్రేడ్ ప్రాబ్లమ్స్. మరోవైపు – తక్కువ ధరలో దొరికే ఆయిల్‌ను వదులుకోవడం వల్ల మన దేశంపై పడే ఎకనామిక్ భారం. అందుకే ఇండియా ఎప్పుడూ ఒకటే చెబుతూ వస్తోంది. మా ఎనర్జీ పర్చేజెస్ అన్నీ మా నేషనల్ ఇంట్రెస్ట్‌కు లోబడే జరుగుతాయి. సో, అసలు గొడవ ఇక్కడే మొదలవుతుంది. ఈ స్టోరీ ముగించే ముందు, ఒక ఇంపార్టెంట్ ఫాక్ట్‌ గురించి చర్చిద్దాం. 100% టారిఫ్ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉన్న కంట్రీ ఇండియా ఒక్కటే కాదు. ఈ రివైజ్డ్ లెజిస్లేషన్ కింద రష్యన్ క్రూడ్ ఎక్కువగా కొంటున్న టాప్ ఫైవ్ కంట్రీస్‌ను ఓసారి లిస్ట్ అవుట్ చేద్దాం. చైనా, ఇండియా, స్లొవేకియా, హంగేరి, అజర్‌బైజాన్. టెక్నికల్‌గా ఇది జస్ట్ ఇండియాకోసం మాత్రమే పెట్టిన బిల్లు కాదు. రష్యన్ ఎనర్జీ కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా తెస్తున్న ఎకనామిక్ ప్రెషర్ ఇది. కానీ మన రష్యన్ ఆయిల్ పర్చేజ్‌ సేల్ చాలా పెద్దది కాబట్టి, ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్.

Also Read : జార్ఖండ్ విద్యార్థుల ఆందోళనలో బిగ్‌ట్విస్ట్‌.. జేపీఎస్‌సీ మాజీ ఛైర్మన్ ఖియాంగ్టే అరెస్టు

నెక్స్ట్ వచ్చేది బిగ్గెస్ట్ క్వశ్చన్. డొనాల్డ్ ట్రంప్ నిజంగానే ఈ 100% టారిఫ్ వెపన్‌ను యూజ్ చేస్తారా? దానికి ఆన్సర్ ఏంటంటే… ఈ బిల్లు చట్టంగా మారి, దానికి తగిన పరిస్థితులు వస్తే ట్రంప్ ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. అలా అని, కంపల్సరీ యూజ్ చేయాలన్న రూల్ లేదు. ఎందుకంటే దేశ ప్రయోజనాల కోసం వెసులుబాటు కల్పించే పవర్స్ ఈ బిల్లు నేరుగా ప్రెసిడెంట్‌కి ఇస్తుంది. ప్రస్తుత సిట్యుయేషన్‌లో ఈ 100% టారిఫ్ అనేది జస్ట్ ఒక త్రెట్ అండ్ పొటెన్షియల్ వెపన్ మాత్రమే, అంతే తప్ప ఆల్రెడీ ఇంపోజ్ చేసిన టారిఫ్ కాదు. స్టోరీ మళ్లీ మోదీ, ట్రంప్ దగ్గరికే వచ్చి ఆగుతుంది. ఇది ట్రేడ్ నెగోషియేషన్స్‌లో జస్ట్ మరో రౌండా? లేక రష్యన్ ఆయిల్‌ కావాలా? అమెరికా మార్కెట్‌ కావాలా? ఏదో ఒకటి తేల్చుకోవాలని ఇండియాపై వాషింగ్టన్ ఫోర్స్ చేస్తోందా? ఎందుకంటే ఇప్పుడు ఇండియా మూడు రీజన్స్‌ను బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ఎనర్జీ సెక్యూరిటీ, ఎకనామిక్ ఇంటరెస్ట్, స్ట్రటాజిక్‌ అటానమీ. ఇండియా క్లోజ్‌గా వాచ్ చేయాల్సిన ఫైవ్ క్వశ్చన్స్ బహుశా ఇవే కావచ్చు! ట్రంప్ నిజంగానే 100% టారిఫ్ వెపన్‌ యూజ్ చేస్తారా? రష్యన్ ఆయిల్‌ను ఇండియా వదులుకోగలదా? టారిఫ్ వార్ వల్ల అసలు నష్టం ఎవరికి? మోదీ, ట్రంప్ కాంప్రమైజ్‌ అవుతారా? అండ్ ఫైనల్లీ… ఇది ఇండియా – యూఎస్ ట్రేడ్ వార్‌కు ఆరంభమా? ఎందుకంటే ఒక్క విషయం మాత్రం క్లియర్‌. సెనేట్ ఓటింగ్ అనేది ఈ స్టోరీకి ఎండ్ కార్డ్‌ కాదు, జస్ట్ బిగినింగ్ మాత్రమే

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.