Strait Of Hormuz : హర్మూజ్‌ జలసంధి విషయంలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్ని యూఏఈకి చెందిన నౌకపై క్షిపణి దాడి చేసిన ఇరాన్‌ తాజాగా మరో చమురు ట్యాంకర్‌ పై క్షిపణులతో దాడులు చేసింది. క్షిపణి దాడికి ట్యాంకర్‌ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇరాన్‌ దాడుల్లో పక్కనే ఉన్న మరో చమురు నౌక కూడా స్వల్పంగా దెబ్బతిన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఇవి ఏ దేశానికి చెందిన ట్యాంకర్లు అనేది ఇంకా తెలియలేదు. అలాగే వాటిలో సిబ్బంది ఉన్నారా? ఉంటే వారు ప్రాణాలతో ఉన్నారా లేదా అనే వివరాలు తెలియలేదు. హర్మూజ్‌ (Strait of Hormuz)లోని జల మార్గాలపై ఒమన్‌తో అమెరికా చర్చలు జరుపుతున్న వేళ ఈ దాడులు జరగడం కలకలం రేపింది. మరోవైపు దక్షిణ ఇరాన్‌గగనతలంలో చక్కర్లు కొడుతున్న అగ్రరాజ్య ఎంక్యూ-9 డ్రోన్‌ను ఐఆర్‌జీసీ దళాలు కూల్చివేశాయని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.

Also Read : చైనాను వణికిస్తోన్న డాల్ఫిన్ తుపాన్.. 2230 విమాన స‌ర్వీసులు ర‌ద్దు

ఇదిలా ఉండగానే.. సౌదీ అరేబియా- హూతీల మధ్య ఘర్షణలు చెలరేగాయి. సౌదీ సైనికులను లక్ష్యంగా చేసుకున్న హూతీలు ఓడరేవుపై జరిపిన దాడుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇక, అరామ్‌కోకు చెందిన జాజన్‌ రిఫైనరీపైనా కూడా హూతీలు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనతో చమురుశుద్ధి కేంద్రం వద్ద భారీగా మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. ఈ కారణంగా రిఫైనరీని తాత్కాలికంగా మూసివేసినట్లు తెలిసింది.

ఈ ఘటనలోనూ ఆస్తి, ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా.. ఇటీవల పాకిస్థాన్, తుర్కియే, సౌదీ అరేబియా తదితర దేశాలు ‘మక్కా ఒప్పందం’ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. దీని ప్రకారం ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా.. దాన్ని మిగిలిన రెండు దేశాలపైనా దాడిగా పరిగణించి కలిసికట్టుగా ఎదుర్కోవాలని నిర్ణయించాయి. ఈ డీల్‌ కుదుర్చుకున్న కొన్ని రోజుల్లోనే హూతీలు సౌదీపై దాడులు చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో ఇప్పుడు మిగిలిన రెండు దేశాలు ఏం చేస్తాయనేది సందిగ్ధంగా మారింది. ఒకవేళ ఆ దేశాలు ఇరాన్‌ పై దాడి చేస్తే పరిస్థితులు ఏ మలుపు తిరుగుతాయన్న విషయంలో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది.

Also Read : ట్రంప్కు నెతన్యాహు దిమ్మతిరిగే షాక్.. ట్రంప్ 15 పాయింట్ల ప్లాన్ రిజెక్ట్!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.