
Canada : ఓ చిన్నారి చేసిన పనికి ఏకంగా విమాన సర్వీసే రద్దయింది. ఈ ఘటన కెనడాలో చోటు చేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఓ చిన్నారి విమానంలో సీటు బెల్ట్ పెట్టుకోనని మారం చేయడంతో విమాన సర్వీసును రద్దు చేసినట్లు సిబ్బంది తెలిపారు. విక్టోరియా అంతర్జాతీయ విమానశ్రయంలో పోర్టర్ ఎయిర్ లైన్స్ (Porter Airlines)కు చెందిన విమానం టొరంటోకు వెళ్లడానికి సిద్దంగా ఉంది. రన్‌వేపై టేకాఫ్‌కు సిద్ధమైన సమయంలో విమానంలో ఉన్న ఓ చిన్నారి సీట్‌బెల్ట్ పెట్టుకోకుండా సీటుపై నిలబడి ఉంది. ఈ విషయాన్ని గమనించిన సిబ్బందితో పాటు పాప తల్లి, క్యాబిన్ సిబ్బంది అ చిన్నారిని కూర్చోబెట్టి సీట్‌బెల్ట్ పెట్టడానికి చాలాసమయం పాటు ప్రయత్నించారు. అయితే చిన్నారి ఎంతసేపటికీ వినకుండా ఏడ్వటం మొదలు పెట్టింది. అంతేకాక తను బెల్ట్ పెట్టుకోనంటూ మారాం చేయడంతో సిబ్బంది ఏమీ చేయలేకపోయారు. సీట్‌బెల్ట్ పెట్టుకోకపోతే విమానాన్ని టేకాఫ్ చేయడం సురక్షితం కాదని భావించిన సిబ్బంది వారిని దించేయాలని నిర్ణయిం తీసుకున్నారు.
Also Read : రష్యాపై ఉక్రెయిన్ భారీ దాడి.. 12 మంది మృతి.. 39 మందికి గాయాలు
View this post on Instagram
దీంతో విమానాన్ని తిరిగి టర్మినల్‌కు చేర్చారు. అనంతరం చిన్నారిని, వారి తల్లిదండ్రులను విమానం నుంచి దించేశారు. ఇక నిబంధనల ప్రకారం వారి ఫ్లైట్ ప్లాన్‌లను తిరిగి ఫైల్ చేసేసరికి సమయం రాత్రి 12:30 గంటలు దాటింది. ఆ సమయంలో రన్‌వేను మూసివేశారు. దీంతో చేసేది లేక విమానం సర్వీసును రద్దు చేశారు. దీంతో అందులో ప్రయాణించాల్సిన ప్రయాణికులు రాత్రి విమానాశ్రయంలోనే ఉండిపోయారు. మరునాడు వారిని అదే విమానంలో తిరిగి వారి గమ్యస్థానాలకు తీసుకువెళ్లారు. ఈ సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకున్నట్లు తెలిసింది..కానీ, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఎయిర్‌లైన్స్ క్షమాపణలు చెప్పటం కొసమెరుపు.
Also Read : దురంధర్‌లో తరహాలోనే లేపేశారా?.. పాక్లో హైటెన్షన్!









