
Meta : అమెరికాలోని న్యూ మెక్సికో కోర్టులో ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటాకు భారీ షాక్ తగిలింది. యువత మెంటల్ హెల్త్, సెక్యూరిటీ కోసం మెటా దాదాపు 567 మిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని కోర్టు ఆదేశించింది. డిజిటల్ వరల్డ్‌లో పిల్లల భద్రత కేవలం పేరెంట్స్ బాధ్యత మాత్రమే కాదని, సోషల్ మీడియా కంపెనీలది కూడా అని జడ్జి బ్రయాన్ బిడ్‌షైడ్ స్పష్టం చేశారు. ఆదేశించిన మొత్తంలో 420 మిలియన్ డాలర్లను నేరుగా యువత మెంటల్ హెల్త్ ట్రీట్‌మెంట్, హెల్ప్ సర్వీసెస్ కోసం వాడాలని ఆదేశించింది. మిగిలిన వాటనిర రాబోయే 5 ఏళ్లలో అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్, స్క్రీనింగ్ సర్వీసెస్, ప్రివెన్షన్ ఆక్టివిటీస్ కోసం ఖర్చు చేయాలని తెలిపింది.
ఈ కేసు ఫస్ట్ ఫేజ్‌లోనే జ్యూరీ మెటాపై 375 మిలియన్ డాలర్ల సివిల్ పెనాల్టీ విధించింది. పిల్లల మానసిక ఆరోగ్యంపై తమ యాప్స్ చూపిస్తున్న నెగెటివ్ ఇంపాక్ట్ తెలిసినా, అలాగే చైల్డ్ అబ్యూజ్ రిస్క్స్ గురించి మెటా నిజాలు దాచిపెట్టిందని జ్యూరీ నిర్ధారించింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఇకపై సెక్యూరిటీ ఫీచర్స్, ప్రైవసీ ఆప్షన్స్, అభ్యంతరకర కామెంట్స్‌ను ఎలా హ్యాండిల్ చేయాలనే దానిపై యూజర్లకు రెగ్యులర్‌గా సమాచారం ఇచ్చేలా స్పెషల్ ఇన్ఫర్మేషన్ ప్యానెల్స్, బానర్స్ తీసుకురావాలంది.
13 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను గుర్తించడానికి AI మోడల్స్‌ను డెవలప్ చేయాలని కోర్టు చెప్పింది. యూజర్ ఫ్రెండ్స్ నెట్ వర్క్, వారు చూసే కంటెంట్ ఆధారంగా AI ఏజ్‌ను అంచనా వేస్తుంది. 13 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా అకౌంట్లు వాడుతున్నట్లు అనుమానం వస్తే.. స్కూల్ స్టాఫ్ నేరుగా రిపోర్ట్ చేసేలా స్కూల్స్, చైల్డ్ సేఫ్టీ ఆర్గనైజేషన్లతో కలిసి ఒక రిపోర్టింగ్ పోర్టల్‌ను క్రియేట్ చేయాలి. అలాగే ఆ చిన్న పిల్లల పర్సనల్ డేటాను వెంటనే డిలీట్ చేయాలని ఆదేశించింది. కోర్టు ఇచ్చిన రూల్స్ అన్నీ సరిగ్గా ఫాలో అవుతున్నారో లేదో చెక్ చేయడానికి మెటా ప్రతి 6 నెలలకోసారి తన ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను కోర్టుకు సబ్మిట్ చేయాలని కోర్టు ఆదేశించింది.









