
India : మెక్కా వేదికగా సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ దేశాలు సరికొత్త రక్షణ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంలో పాకిస్తాన్ భాగం కావడమే భారత్ ఆందోళన చెందడానికి ప్రధాన కారణం. ఈ ఒప్పందం ప్రకారం ఈ మూడు దేశాల్లో ఏ ఒక్కరిపై విదేశీ దాడులు జరిగినా, అది మిగిలిన ఇద్దరిపై జరిగిన దాడిగానే భావించి ముగ్గురూ కలిసి పోరాడతారు. అయితే పాకిస్తాన్ ఈ ఒప్పందంలో ఉండటంతో భారత్ పై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Also Read : అమెరికానే టార్గెట్ గా ఇరాన్ కొత్త ప్లాన్.. సంచలన ప్రకటన!
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగితే ఒక్కరిపై దాడి జరిగితే అందరిపై జరిగినట్లే అనే రూల్‌ను వాడుకుని, సౌదీ, టర్కీల నుంచి తనకు మద్దతు ఇవ్వాలని పాకిస్తాన్ కోరే ప్రమాదం ఉంది. దీనివల్ల ప్రపంచ దేశాల నుంచి భారత్‌పై ఒత్తిడి తెచ్చి, యుద్ధాన్ని త్వరగా ఆపేలా దౌత్యపరమైన వ్యూహాలు పన్నవచ్చు. అంతేకాకుండా, గత కొన్నేళ్లుగా భారత్‌కు సౌదీ అరేబియాతో చాలా మంచి వ్యాపార, చమురు బంధం ఉంది. కానీ ఇప్పుడు సౌదీ నేరుగా పాకిస్తాన్‌కు భాగస్వామిగా మారడంతో, రేపు భారత్-పాక్ మధ్య సమస్యలు వస్తే సౌదీ ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాల్సిందే.
అయితే, దీనికి మరో వైపు కూడా ఉంది.. కాబట్టి భారత్‌కు తక్షణమే వచ్చే ముప్పు ఏమీ లేదు. ఈ ఒప్పందాన్ని సౌదీ అరేబియా కేవలం పశ్చిమాసియాలో తమ చమురు కేంద్రాలను కాపాడుకోవడానికే చేసుకుంది తప్ప, భారత్‌ను మనసులో పెట్టుకుని చేసింది కాదు. పైగా భారత్ సౌదీకి అతిపెద్ద చమురు కస్టమర్, మనతో సౌదీకి వేల కోట్ల వ్యాపారం ఉంది కాబట్టి భారత్‌తో సంబంధాలను సౌదీ అంత సులభంగా పాడు చేసుకోదు. ఏదేమైనా, పాకిస్తాన్ బలం పెరిగే అవకాశం ఉంది కాబట్టి భారత విదేశాంగ శాఖ, మన సైన్యం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తూ, మన రక్షణకు ఎలాంటి లోటు రాకుండా ముందస్తు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిసైళ్లు, యుద్ధ విమానాలు, భారీ సైన్యం భారత్ సొంతం. పాకిస్తాన్ ఎలాంటి కొత్త ఒప్పందాలు చేసుకున్నా, కొత్త రకం డ్రోన్లు తెచ్చుకున్నా భారత్ ను నేరుగా ఏమీ చేయలేదు. మన రక్షణ శక్తి ఏ స్థాయిలో ప్రభావితం చేయదు. భారత్త దగ్గర ఉన్న బ్రహ్మోస్ రాకెట్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వెళ్లే మిసైల్.
Also Read : మెటాకు భారీ షాక్.. రూ.5,500 కోట్ల ఫైన్!









