
రష్యాపై ఉన్న కోపంతో ఆ దేశం నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై టారిఫ్‌లు విధిస్తామని హెచ్చిరించినా అమెరికా అన్నంత పనిచేసింది. రష్యాను శిక్షించే క్రమంలో ఆ దేశంతో పాటు భారత్, చైనా తదితర దేశాలపై 100 అదనపు టారిప్‌లు విధించే లక్ష్యంతో రూపొందించిన బిల్లుకు.. అమెరికా సెనేట్ భారీ మెజారిటీతో ఆమోదం తెలిపడం గమనార్హం. రష్యాతో పాటు, ఆ దేశం నుంచి పెట్రోలియం ఉత్పత్తుల్ని కొంటున్న దేశాలపై ఆంక్షలు విధించే ఉద్దేశంతో తీసుకువచ్చిన ఈ బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదం తెలిపింది. రష్యా నుంచి భారత్, చైనా ఇతర దేశాలు ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నాయి. దీనివల్ల పరోక్షంగా ఉక్రెయిన్‌పై యుద్ధానికి ఆ దేశాలు సాయపడుతున్నట్లేనని అమెరికా అభిప్రాయపడుతోంది. ఆ అభిప్రాయంతోనే ఈ బిల్లును తీసుకువచ్చింది. రష్యా నుంచి చమురు, గ్యాస్ దిగుమతి చేసుకుంటున్న అగ్ర శ్రేణి ఐదు దేశాలపై 100% టారిఫ్‌ల విధించడానికి అధ్యక్షుడు ట్రంప్‌నకు ఇది అధికారమచ్చినట్లయింది. దీంతో రష్యా నుంచి ఇంధన దిగుమతి చేసుకుంటున్న చైనా, భారత్, అజర్‌బైజాన్, హంగరీ, స్లొవేకియాలపై ఈ ప్రభావం పడనుంది. ఇదే బిల్లులో ఇరాన్ ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలపై ఆంక్షలు విధించే చట్టాన్ని పొడిగించడం కూడా ఉంది.. దీనిపై ప్రతినిధుల సభ ఈ నెల 31న నిర్ణయం తీసుకోనుంది.
ఈ బిల్లుకు భారీ మెజారిటీ లభించింది. బిల్లుకు అనుకూలంగా 86మంది ఓటు వేయగా, 11మంది మాత్రమే వ్యతిరేకించారు. రష్యా నుంచి ముడి చమురు, సహజవాయువు, ఇతర ఉత్పత్తులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్న ఈ ఐదు దేశాలపై టారీఫ్‌లు, ఆంక్షలు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి కట్టేబెట్టేందుకు ఈ బిల్లు ఉపకరిస్తుంది. దీని ప్రకారం ఆయా దేశాలు అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై అదనపు సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది. రిపబ్లికన్లకు మెజారిటీ కలిగిన ప్రతినిధుల సభ ఆమోదం తెలిపితే, అధ్యక్షుడు ట్రంప్ సంతకంతో ఈ చట్టం అమల్లోకి రానుంది. ప్రముఖ రిపబ్లికన్ నేత లిండ్సే ఓ గ్రాహమ్ ఈ బిల్లును ప్రతిపాదించడం గమనార్హం. ఆయన ఈ ఏడాది జూలై 11న ఆయన హఠాన్మరణం చెండాడు. దీంతో బిల్లు పేరును ‘లిండ్సే గ్రాహమ్ రష్యా, ఇరాన్ ఆంక్షల చట్టం 2026’అని పెట్టడం గమనార్హం. ఉక్రెయిన్‌కు మద్దతుగా, రష్యా ఆర్థిక వనరులను దెబ్బతీసే లక్ష్యంతో గ్రాహమ్‌తోపాటు డెమొక్రాట్ రిచర్డ్ బ్లుమెంతల్ ఈ బిల్లును ప్రతిపాదించారు. చైనా, భారత్ తదితర దేశాలు రష్యా నుంచి చౌక చమురు కొనుగోలు చేస్తూ, ఆ డబ్బును ఉక్రెయిన్‌పై యుద్ధానికి ఉపయోగించేందుకు పరోక్షంగా సహకరిస్తున్నాయని అమెరికా చాలాకాలంగా ఆరోపిస్తోంది. భారత దేశం దిగుమతి చేసుకుంటున్న చమురు దిగుమతుల్లో రష్యా వాటా 40శాతానికి పైగా ఉంది. అయితే, అమెరికా, భారత్ మధ్య ట్రేడ్ డీల్ అమల్లోకి వస్తే ఈ అదనపు సంకాల నుంచి భారత్‌కు మినహాయింపు లభించే అవకాశం ఉందని భారత ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.









