US Student Visa : అమెరికాలో చదువుకోవాలని కలలు కనే భారతీయ విద్యార్థులకు ట్రంప్‌ వరుసగా షాక్‌ లు ఇస్తూనే ఉన్నాడు. 2025 బిజీ అడ్మిషన్‌ సీజన్‌లో భారతీయ విద్యార్థులకు వీసా అనుమతులు గణనీయంగా తగ్గినట్లు యూఎస్ మేధో మధన సంస్థ సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ (సీఐఎస్) తాజాగా వెల్లడించింది. దీనిద్వారా భారతీయ విద్యార్థులకు యూఎస్ స్టూడెంట్ వీసాల జారీలో భారీ కోత పడినట్లు తెలుస్తోంది. చైనాతో పోలిస్తే భారతీయులకు స్టూడెంట్‌ వీసా నిరాకరణలు గతం కంటే అధికంగా ఉన్నట్లు సీఐఎస్‌ అధ్యయనంలో వెల్లడైంది. అమెరికా విధించిన వీసా ఆంక్షలతో భారతీయులపై తీవ్ర ప్రభావం పడినట్లు తెలుస్తోంది. ఆ తరువాతి స్థానంలో చైనీయులు ఉన్నట్టు తెలిపింది.

Also Read : గంటకు 8,700 కిలోమీటర్ల వేగంతో…. చంద్రుడిపై కూలిన స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌శకలం..

గతేడాది (2025) మే నుంచి -ఆగస్టు మధ్యకాలంలో అమెరికా కాన్సులేట్లు భారతీయ విద్యార్థులకు 22,149 ఎఫ్‌-1 స్టూడెంట్‌ వీసాలు జారీ చేసినట్లు సీఐఎస్‌ తెలిపింది. 2024లో ఈ సంఖ్య 58,694 గా ఉండగా ఈ ఏడాది ఘననీయంగా తగ్గాయి. విద్యార్థి వీసాలు (F-1 Visa) గతేడాదితో పోలిస్తే 62 శాతం వరకు తగ్గాయి. సాధారణంగా ఏటా ఈ సీజన్‌లో భారతీయులకు సగటున 50వేల పైనే విద్యార్థి వీసాలు వచ్చేవి. కానీ, గతేడాది ఈ సంఖ్యలో భారీ తగ్గుదల కన్పించడం ఆందోళన కలిగించే అంశమనే చెప్పాలి. అదే సమయంలో చైనా విద్యార్థులకు కూడా వీసా అనుమతులు 34 శాతం వరకు తగ్గాయి. 2024లో చైనీయులకు 61,075 విద్యార్థి వీసాలు ఇవ్వగా.. గతేడాది ఆ సంఖ్య 40,034కు తగ్గింది. విద్యార్థి వీసాలకు అత్యంత కీలకమైన సమయంగా భావించే మే నుంచి -ఆగస్టు వరకు గల పీరియడ్‌ను స్తారు. అమెరికాలో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు ఈ సీజన్‌లో అంతర్జాతీయ విద్యార్థులు వీసాల కోసం దరఖాస్తులు చేసుకుంటారు.

భారతీయ విద్యార్థులకు విద్యార్థులకు అనుమతులు గణనీయంగా తగ్గినప్పటికీ.. అమెరికా విద్యాసంస్థల్లో చేరుతున్న విదేశీ విద్యార్థుల్లో అత్యధికులు భారతీయులే కావడం విశేసం. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ గణాంకాలు తెలిపిని వివరాల ప్రకారం.. 2024-25 విద్యా సంవత్సరంలో 3,63,019 మంది భారత విద్యార్థులు అమెరికాకు చెందిన కాలేజీలు, యూనివర్సిటీల్లో చేరినట్లు నివేదిక తెలిపింది. అలాగే చైనా నుంచి 2,65,919 మంది గతేడాది అమెరికాకు చదువుకునేందుకు చేరుకున్నారని తెలిపింది.

మరోవైపు గతంలో ఎఫ్‌1 వీసాలపై వచ్చిన విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యేంత వరకూ ‘డ్యురేషన్‌ ఆఫ్‌ స్టేటస్‌’ కింద ఉండడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ నిబంధనను ఎత్తివేసి నిర్దిష్ట కాలపరిమితిని అమలు చేసేందుకు అమెరికా సిద్ధమైంది. కొత్త నిబంధనల ప్రకారం.. నాలుగేళ్లకు మించి అమెరికాలో ఉండాలంటే.. విదేశీ విద్యార్థులు మళ్లీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ నిబంధనలు సెప్టెంబరులో అమల్లోకి రానున్నాయి.
సీఐఎస్ నివేదిక ప్రకారం, 2024-25లో దాదాపు మూడు లక్షల మంది విదేశీ విద్యార్థులు తమ చదువులు పూర్తయ్యాక ఓపీటీ విధానంలో అమెరికాలోనే తాత్కాలిక ఉపాధి పొందారు. ఈ విధానంలో ఉపాధి పొందిన 2,94,253 మంది విదేశీ విద్యార్థుల్లో 49 శాతం మంది భారతీయులే కావడం గమనార్హం. ఇక 21 శాతం మంది చైనీయులు ఉన్నారు. అమెరికా విద్యార్థులు, వర్కర్ల ఉపాధి అవకాశాలపై ఓపీటీ ప్రతికూల ప్రభావం చూపుతోందని సీఐఎస్ తన నివేదికలో పేర్కొనింది. దీంతో ఈ ప్రోగ్రామ్‌కు ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించింది.

Also Read : ఇండియన్స్‌కు ట్రంప్‌ మరో షాక్‌… బర్త్‌రైట్‌ సిటిజన్‌ షిప్‌పై కొత్త ఆదేశాలు

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.